Sunday, July 24, 2011

చిత్రం : ఆత్మగౌరవం (1966)
రచన : ఆరుద్ర
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల



rAnani rAlEnani Urake anTAvu (plz search the song in this link)


Ls

Dl


పల్లవి :
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలని ఆశలేనిదే...ఎందుకు వస్తావు
రానని రాలేనని ఊరకే అంటావురావాలని ఆశలేనిదే...ఎందుకు వస్తావు

చరణం : 1
కొంటెచూపు చూడకు...గుండెకోత కోయకు
కోపమందు కులుకు చూపి...కోర్కె పెంచకు
కొంటెచూపు చూడకు...గుండెకోత కోయకు
కోపమందు కులుకు చూపి ...కోర్కె పెంచకు

వేషమైన మోసమైన అంతా నీకోసం...
ఊహూ అలాగ ॥
రానని రాలేనని ఊరకే అంటావురావాలని ఆశలేనిదే...ఎందుకు వస్తావు

చరణం : 2
ఎదను గాయమున్నది ...ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని ...మూల్గుచున్నది
పాపం
 
ఎదను గాయమున్నది ...ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని ...మూల్గుచున్నది
గుండెమీద వాలిచూడు గోడువింటావు ఆ! అబ్బబ్బబ్బా...॥
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు॥


చరణం : 3
దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసుపడే బాధ అయ్యయ్యో!
కరుణచూపు కరుగకున్నా టాటా చీరియో
టాటా చీరియో...
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు॥





1 comment:

  1. baavundi bangaram. Nice song and thanx for lyrics too. :)

    ReplyDelete