Showing posts with label అరుంధతి (2009). Show all posts
Showing posts with label అరుంధతి (2009). Show all posts

Tuesday, January 4, 2011

చిత్రం : అరుంధతి (2009)
రచన : అనంత శ్రీరామ్,
సంగీతం : కోటి
గానం : సందీప్, శ్రీకృష్ణ, మురళి, రేణుకనాగ సాహితి

<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Arundhathi.html?e">Listen to Arundhathi Audio Songs at MusicMazaa.com</a></p>
 DL

పల్లవి : 
చందమామ నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
వెన్నెలంత నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే
చుక్కలే ముత్యాలల్లి మెళ్ళో వేశావే
డోలారే డోలారే ఢం కోలాటాలాడే క్షణం
డోలారే... ఇల్లంతా బృందావనం
పూసే ఈ సంపంగి చెంపల్లో
సిగ్గెంతో పొంగే క్షణం
దూకే ఆ గుండెల్లో తొందర్లే
చూద్దామా తొంగి మనం ॥
చరణం : 1
ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి
ఇలా సందళ్ళే రావాలని
ఇన్నేళ్ళు చూసింది మా మామిడి
ఇలా గుమ్మంలో ఉండాలని
మురిసే ప్రేమల్లో ఉయ్యాలూపంగా
తనిలా పెరిగింది గారాబంగా
నడిచే శ్రీలక్ష్మి పాదం మోపంగా
సిరులే చిందాయి వైభోగంగా
వరించి తరించి వాడె వస్తున్నాడు
అడ్డం లెగండోయ్
హే డోలారే..
అరె వారేవా ఏం సోయగం
డోలారే... నువ్వేగా నాలో సగం
డోలారే... కార్తీకదీపం కాంతుల్లో రూపం
శ్రీగౌరివోలె లేదా
శివుడల్లే చేరగా సౌభాగ్య సంపద

చరణం : 2
నాతోటే నాచోరే ఓ సోనియే
నువ్వే పుట్టావే మేరే లియే
నాకంటి పాపల్లే చూస్తానులే
అనే మాటిచ్చుకుంటానులే
మనసే బంగారం అంటారోయ్ అంతా
ఇహ పో నీ పంటే పండిందంట
అడుగే వేస్తుందోయ్ నిత్యం నీవెంట
కలలోనైనా నిను విడిపోదంట
ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని
అంతా చూడండోయ్
డోలారే... నా చుట్టూ ఈ సంబంధం
డోలారే డోలారే ఢం ఏ జన్మదో ఈ వరం
ప్రాణంలో నే దాచుకుంటాను
పంచేటి ఆ ప్రాయము
జన్మంతా గుర్తుంచుకుంటాను
ఈనాటి ఆనందము
డోలారే... ఇల్లంతా బృందావనం (2)