Showing posts with label Santhosam-Nag. Show all posts
Showing posts with label Santhosam-Nag. Show all posts

Wednesday, September 16, 2009

సంతొషం

ListenIng the Song

download

నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా

నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తెలిచి చెప్పవె ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవె హౄదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా

నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా

రెక్కలు తొడిగిన తలపు,నువే కాద నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు, నువ్వే సహవాసమా
హద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపాకిల అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కదా
తడపడ నీయకు కదిలిన కధ
వెతికే మనసుకు ,మమతే పంచుమా

నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా

ప్రేమ నీతో పరిచయమే ఎదో పాపమా
అమౄతమనుకొని నమ్మటమే, ఒక శాపమా
నీ ఒడి చెరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవుల పై చిరు నవ్వుల దగ
కనపడ నీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా

నీ ఆటేఏమిటో ఎనాటికి ఆపావు కదా
నీ పాటేమిటో ఏ జంటకి చూపావు కదా
తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చలగాటమా
చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా

నీ ఆటేఏమిటో ఎనాటికి ఆపవు కదా
నీ పాటేమిటో ఏ జంటకి చూపవు కదా