Showing posts with label Chirunavutho-Venu. Show all posts
Showing posts with label Chirunavutho-Venu. Show all posts

Friday, June 12, 2009

చిరునవ్వుతో
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ
ఆ సంగీతం నీ తొడై సాగవే గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి
ఓహో... ఓహో....

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లే కష్టమొస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేని పోని సేవ చెయ్యకు
మినుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకదా
ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయదా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి
ఓహో... ఓహో....

ఆశలు రేపిన అడియాశలు చూపిన
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపిన అడియాశలు చూపిన
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడ కళ నేడు తలుచుకుంటు
నిద్ద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటు
లేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిల కిలతో తరిమేయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి
ఓహో... ఓహో...