Showing posts with label Rajkumar-Shoban babu. Show all posts
Showing posts with label Rajkumar-Shoban babu. Show all posts

Thursday, May 28, 2009

Rajkumar
Starring : Sobhan Babu, Jayasudha, Ambika
Music : Ilayaraja
Director : G Raminaidu

LS


DL

జానకి కలగనలేదు, రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు ,జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిదీ, ఈనాడు మనకూ నిజమైనదీ
ఆ రామాయణం, మన జీవన పారాయణం
రాముడు అనుకోలేదు, జానకి పతి కాగలనని ఆనాడు

చెలి మనసే శివధనుసైనది ,తొలిచూపుల వశమైనది
వలపు స్వయం వరమైనపుడు గెలువనిదీ యేదీ
ఒక బాణం ఒక భార్యన్నది, శ్రీరాముని యశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి
తొలిచుక్కవు నీవే, చుక్కానివి నీవే
తుదిదాకా నీవే, మరు జన్మకు నీవే
ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆఆఆ


జానకి కలగనలేదు ,రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు, జానకి పతి కాగలనని ఆనాడు

సహవాసం మనకు నివాసం, సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం, పెదవులపై హాసం
సుమసారం మన సంసారం, మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం, పరవశ శ్రుంగారం
గతమంటే నీవే ,కధ కానిది నీవే
కలలన్నీ నావే ,కలకాలం నీవే
ఆఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆఆఆ

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిదీ ఈనాడు మనకూ నిజమైనదీ
ఆ రామాయణం మన జీవన పారాయణం
లా లా లా లా లా లా