తొలి ప్రేమ
Get Your Own Hindi Songs Player at Music Plugin
download the Song
ఈ మనసే సే సే సే సే...
నా మనసే సే సే సే సే...
పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన వూసే
అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే
ఈ మనసే సే సే సే సే...
నా మనసే సే సే సే సే...
ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
కోరుకున్న తీరాన్నె తాను చేరినా
తీరిపోని ఆరటంతో కలవరించెనా
వెనకనే తిరుగుచు చెలి జత విడవదు
దొరికిన వరమటు కుదురుగ నిలువదు
ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే
ఈ మనసే సే సే సే సే...
నా మనసే సే సే సే సే...
నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే
అయినా ఇంకా ఏదో అడిగే అత్యాసే
నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే
అయినా ఇంకా ఏదో అడిగే అత్యాసే
వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నెలంటి నీ నవ్వులో చెమ్మగిల్లినా
తహ తహ తరగదు అలజడి అణగదు
తన సొద ఇది అని తలపులు తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే
ఈ మనసే సే సే సే సే...
నా మనసే సే సే సే సే...
పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన వూసే
అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే
ఈ మనసే సే సే సే సే...
నా మనసే సే సే సే సే...
No comments:
Post a Comment