Sunday, November 29, 2009

ఆపద్బందావుడు(1992)





తారాగణం: చిరంజీవి,మీనాక్షి శేషాద్రి,జంధ్యాల

గాత్రం: బాలు,చిత్ర
సంగీతం: కీరవాణి
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
సంస్థ: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్


పల్లవి:

చుక్కల్లారా... చూపుల్లారా... ఎక్కడమ్మ జాబిలి
మబ్బుల్లారా... మంచుల్లారా... తప్పుకోండే దారికి
వెళ్ళనివ్వరా... వెన్నెలింటికి ...విన్నవించరా... వెండిమింటికి
జోజో లాలి జోజో లాలి

చరణం1:

మలిసంధ్య వేళాయే... చలిగాలి వేణువాయే... నిద్దురమ్మ ఎటుబోతివే
మునిమాపు వేళాయే... కనుపాప నిన్ను కోరే... కునుకమ్మ ఇటు చేరవే
నిదురమ్మ ఎటుబోతివే... కునుకమ్మ ఇటు చేరవే
నిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవే
గోధూళి వేళాయే గూళ్ళన్ని కనులాయే
గోధూళి వేళాయే గూళ్ళన్ని కనులాయే
గువ్వల రెక్కలపైన రివ్వు రివ్వున రావే
జోల పాడవా... బేలకళ్ళకి... వెళ్ళనివ్వరా... వెన్నెలింటికి
జోజో... లాలి జోజో ...లాలి జోజో... లాలి జోజో లాలి


One Of My Fav Song :)

No comments:

Post a Comment