Friday, November 27, 2009

కొండవీటి దొంగ


Get Your Own Hindi Songs Player at Music Plugin

Dl

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో

పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వొత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో

శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో

చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతు నిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లె మబ్బు లాడెనేమో బాల వీణ వేణికి

మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కధంతేలే అదంతేలే

హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా రేణు పూల తోటలో

వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు
వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంచలు
అంతేలే కధంతేలే అదంతేలే

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో

No comments:

Post a Comment