Sunday, November 29, 2009

అభిలాష


Get Your Own Hindi Songs Player at Music Plugin

తారాగణం:
చిరంజీవి,రాధిక,రావుగోపాలరావు
గాత్రం:బాలు,జానకి
సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:కోదండరామిరెడ్డి
నిర్మాత:కె ఎస్ .రామారావు


పల్లవి:

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే

చరణం1:

తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలి పోదాములే
గాలి వానల్లో మబ్బు జంటల్లే రేగి పోదాములే
విసిరే కొసచూపే ముసురై పోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తలదాచుకో
తాపాలలో వున్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే

చరణం2:

పూత పెదవుల్లో పుట్టు గొరింత బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగ కుర్ర బుగ్గలో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనాసేదో ఒకటై పొమ్మంటే
ఎదిగె వలపంతా ఎదలొకటై రమ్మంటే
కలాలు కరిగించు కౌగిల్లలో
దీపాలు వెలిగించు నీ కల్లతో
ఆ మాట వింటే కరిగే నా ప్రణమంతా నీ సొంతమేలే

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే

No comments:

Post a Comment