Monday, January 3, 2011

చిత్రం : లక్ష్మీ కళ్యాణం (2007)
రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : నిహాల్, ప్రణవి
 <p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Lakshmi+Kalyanam.html?e">Listen to Lakshmi Kalyanam Audio Songs at MusicMazaa.com</a></p>
 
DL 
 
పల్లవి : అలిగావా చిట్టి చిలకా దిగవా నేలవంక
అడిగేశా ఉండలేక చాల్లే బెట్టు చేయక
ఔననుకో గోరువంకా
అలుసిచ్చాను గనుక
జరిగిందే తెలుసుకోక
నాపై నిందలేయక
నీకేమి ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక... ఆ...
చరణం : 1
ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవైనట్టు ఉంది
నా నుంచి నేనే వేరైనట్టు ఉంది
ఊరుకోలేను చేరుకోలేను
మనసిలా ఎందుకుంది
మూగనేంకాను మాటకాలేను
ఏమిటౌతున్నది
చరణం : 2
నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింక ఉన్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే
చిలిపి జగడాన్ని పెంచుకున్నాను
నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూశాను
పంతమా ఆగవే...

No comments:

Post a Comment