చిత్రం : అనగనగా ఓ ధీరుడు (2011)
రచన : చంద్రబోస్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : అనూజ్ గురువారా, ఛైత్ర |
Dl
పల్లవి :
నిన్ను చూడని... నిన్ను చూడని
కన్నులెందుకో అని... అని...
నిన్ను తాకని... నిన్ను తాకని
చేతులెందుకో అని... అని...
మనస్సు చెప్పుతోంది
ఈ మంచిమాటని
వయస్సు ఒప్పుకుంది... ఆ మాట చాలని
సుదూర తీరమేదో ఏరికోరి మీరి
చేరగా చెంతగా మారగా జంటగా
సూటిగా... ఘాటుగా
రెప్పవేయకుండా మూయకుండా
నిన్ను చూడని... నిన్ను చూడని
కన్నులెందుకో అని... అని...
కన్నులెందుకో అని... అని...
నిన్ను తాకని... నిన్ను తాకని
చేతులెందుకో అని... అని...
చేతులెందుకో అని... అని...
చరణం : 1
కోనదాటి వచ్చా... కొండదాటి వచ్చా
నింగిలాగ వచ్చా... నిండు ప్రేమ తెచ్చా
కోటదాటి వచ్చా... తోటదాటి వచ్చా
కొమ్మలాగ వచ్చా...కొత్త ప్రేమ తెచ్చా
మేఘమల్లే వచ్చా... మెరుపులిచ్చా
కౌగిలల్లె వచ్చా... కానుకకిచ్చా
చేరగా చెంతగా ...మారగా జంటగా
వేడిగా... వాడిగా
చుట్టు పక్కలేవీ చూడకుండా
నిన్ను చూడని... నిన్ను చూడని
కన్నులెందుకో అని... అని...
కన్నులెందుకో అని... అని...
నిన్ను తాకని... నిన్ను తాకని
చేతులెందుకో అని... అని...
చేతులెందుకో అని... అని...
చరణం : 2
గీత మారుతున్నా... రాత మారుతున్నా
ఊపిరాగుతున్నా ...ఉండలేక వచ్చా
హాని జరుగుతున్నా...అలుపు పెరుగుతున్నా
ప్రాణమాగుతున్నా... పరుగులెట్టి వచ్చా
అమృతాన్ని తెచ్చా... ఆయువిచ్చా
అద్భుతాన్ని తెచ్చా... హాయినిచ్చా
చేరగా ...చెంతగా... మారగా... జంటగా
నీడగా... తోడుగా
ఒక్క నీటి బొట్టు జార కుండా
నిన్ను చూడని... నిన్ను చూడని
కన్నులెందుకో అని... అని...
కన్నులెందుకో అని... అని...
నిన్ను తాకని... నిన్ను తాకని
చేతులెందుకో అని... అని...
చేతులెందుకో అని... అని...
No comments:
Post a Comment