Friday, May 6, 2011

చిత్రం : బంగారుబొమ్మలు (1977)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల



Listen The Song


Dl

పల్లవి :
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
... ఈ... ఈ...॥
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరి
నీ

మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
... ఈ... ఈ...॥



చరణం : 1
కనకదుర్గ కనుసన్నలలో
గలగల పారే తన ఒడిలో

కనకదుర్గ కనుసన్నలలో
గలగల పారే తన ఒడిలో
మన పడవలు రెండూ పయనించాలని
బ్రతుకులు నిండుగ పండించాలని

కలిపింది ఇద్దరినీ...
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

చరణం : 2
నీ కురుల నలుపులో... నీ కనుల మెరుపులో...
అలలై... కలలై... అలలై కలలై తానే వెలిసింది
నీ లేత మనసులో... నీ దోర వయసులో...
వరదై... వలపై... వరదై వలపై తానే ఉరికిందీ

చిరుగాలుల తుంపరగా...
చిరునవ్వుల సంపదగా...


చరణం : 3
పంట పొలాల్లో పచ్చదనంగా
పైరగాలిలో చల్లదనంగా ॥
పల్లెపదంలో తీయదనంగా
చిరంజీవులై జీవించాలని
కలిపింది ఇద్దరినీ...
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ॥

No comments:

Post a Comment