చిత్రం : ఆత్మగౌరవం (1965)
రచన : దాశరథి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల
Dl
రచన : దాశరథి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల
Dl
పల్లవి : అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే అందెను నేడే అందని జాబిల్లి చరణం : 1 ఇన్నేళ్ళకు విరిసె వసంతములు ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు నిదురించిన ఆశలు చిగురించెలే (2) చెలికాడే నాలో తలపులు రేపెనులే అందెను నేడే అందని జాబిల్లి చరణం : 2 నా చెక్కిలి మెల్లగ మీటగనే నరనరముల వీణలు మ్రోగినవి గిలిగింతల నా మేను పులకించెలే (2) నెలరాజే నాతో సరసములాడెనులే అందెను నేడే అందని జాబిల్లి చరణం : 3 ఇక రాలవు కన్నుల ముత్యములు ఇక వాడవు తోటల కుసుమములు వినువీధిని నామది విహరించెలే (2) వలరాజే నాలో వలపులు చిలికెనులే ॥ |
No comments:
Post a Comment