Friday, April 20, 2012

చిత్రం : అనుబంధం (1984)
రచన : ఆత్రేయ, సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి




Plz select the song


DL

పల్లవి : మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది 
గుండెలోన
వేడుంది ఒంటిలో 
జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా
మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రని పెదవిలో 
బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా



చరణం : 1 నీ చిలిపినవ్వులో 
ఆ నువ్వు వెలుగులో
నా సొగసు ఆరబోసి మెరిసిపోనా
నీ ఒంటి నునుపులో 
నీ పెదవి ఎరుపులో
నా వయసు పొంగు నేను 
కలుపుకోనా
గంగలాగ ఉరికి రానా
కడలిలాగ కలుపుకోనా
నా గుడిలో ఉయ్యాలలూగించనా
నా ఎదకు నిను జేర్చి జోకొట్టనా
నీతోటి బ్రతుకంతా 
ఒక వింత గిలిగింత
అనిపించి మెప్పించి ఒప్పించుకోనా


చరణం : 2 నీ ముద్దు ముద్దులు 
మురిపాల సద్దులు
ముప్పొద్దు మునిగి తేలి 
మురిసిపోనా
నీ మెత్త మెత్తని సరికొత్త మత్తులో
నే చిత్త చిత్తరంగా హత్తుకోనా
హోయ్ గుండెలోనా నిండిపోనా
నిండిపోయి ఉండిపోనా
నీ ప్రేమ నూరేళ్లు పండించనా
నీ ఇల్లు వెయ్యేళ్లు వెలిగించనా
బంధాలు ముడివేసి 
అందాల గుడిచేసి
అనురాగ అర్చనలే చేయించుకోనా

No comments:

Post a Comment