Saturday, April 7, 2012

చిత్రం : పంజా (2011)
రచన : చంద్రబోస్
సంగీతం : యువన్‌శంకర్‌రాజా



పల్లవి :


ఎలా ఎలా ఎలా ఎలా 
నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా 
నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా 
జన్మ మరల...॥ఎలా॥


చరణం :

నిన్నలోని నిమిషమైనా 
గురుతురాదే ఈ క్షణం
నీటిలోని సంబరాన 
ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా...
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలనీ
నూరేళ్ల పయనాలు చేయాలనీ
ఈ పరవశంలోన నిలిచా 
ప్రాణశిలలా ॥ఎలా॥

గానం : హరిచరణ్, శ్వేతా పండిట్

క్షణం క్షణం ప్రతిక్షణం
కోరే ధనం పచ్చందనం
నిజం నిజం నిరంతరం
మీరే కదా ఆరోప్రాణం
మీ బాధలే నే పంచుకోనా
మీ హాయినే హోయ్ నేర్పించనా
మన నవ్వుతో నవ్వుతుంది 
ఈ ప్రపంచం
వస్తున్నా నేస్తం... 
అందిస్తాలే నవ జీవితం (2)

No comments:

Post a Comment