గానం : పాలక్కడ్ శ్రీరామ్, రీటా
రచన : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
ఓసోసి పిల్లపోరి ...ఓ చిన్న మాట జారి ...ఏం దెబ్బ తీసినావే
రాకాసి ...రాకుమారి కోపంగా పళ్లునూరి ...ఐ లవ్మూ చెప్పినావే
అందంగా పెట్టినావే స్పాటు
గుండె తాకిందే ప్రేమ గన్ను షాటు
ఏది లెఫ్టు ...ఏది నాకు రైటు మందు కొట్టకుంటనే... నేను టైటు
క్యాట్ బాలు లాగిపెట్టి మల్లెపూలు చల్లినట్టు
షర్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్టు జరిగినట్టు
పిచ్చి పిచ్చిగుందే...
కిర్రాకు... కిర్రాకు ...కిర్రాకు ...ర్రాకు ర్రాకు పుట్టించావే
కిర్రాకు... కిర్రాకు... కిర్రాకు...ర్రాకు కేక పెట్టించావే
పెదవి స్ట్రాబెరీ ...పలుకు క్యాడ్‌బరీ
సొగసు తీగలో ...కదిలింది... పూల నర్సరీ
కళ్లలో... కలల గ్యాలరీ... చిలిపిచూపులో
కొలువుంది ద్రాక్ష మాధురి
అత్తరేదో చల్లినావే ...అత్తగారి పిల్లా
సిత్తరాల నవ్వుపైన...రతనాలు జల్లా
కొత్తప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా
పిచ్చి పిచ్చిగుందే॥
కిర్రాకు... కిర్రాకు ...కిర్రాకు ...ర్రాకు ర్రాకు పుట్టించావే
కిర్రాకు... కిర్రాకు... కిర్రాకు...ర్రాకు... కేక పెట్టించావే
మాంకాళి జాతర్లో... మైకుసెట్టు మోగినట్టు
మైండంత గోలగుందే
బెంగాలీ స్వీటులోన... భంగేదో కలిపి తిన్న
ఫీలింగు కమ్ముతోందే
కౌబాయి డ్రెస్సు వేసిన ట్టూ... క్రష్ణరాయలోరి గుర్రమెక్కినట్టు
భూమ్మీద ఉన్నచోటే ఉంటూ
ఆ మూను మీద కాలు పెట్టినట్టు
సిమ్ము లేని సెల్లులోకి ఇన్‌కమింగు వచ్చినట్టు
సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడరద్దినట్టు పిచ్చిపిచ్చిగుందే॥
కిర్రాకు... కిర్రాకు ...కిర్రాకు ...ర్రాకు ర్రాకు పుట్టించావే
కిర్రాకు... కిర్రాకు... కిర్రాకు...ర్రాకు... కేక పెట్టించావే...
No comments:
Post a Comment