ప్రాణం ఖరీదు :
పల్లవి:
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా
పూరి గుడిసెలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు ||యాతమేసి||
చరణం : ౧
పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా
పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా
కుడితి నీళ్లు పోసినా
అది పాలు కుడుపుతాది
కడుపుకోత కోసినా
అది మనిషికే జన్మ ఇత్తాది
బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో ||యాతమేసి||
చరణం : ౨
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా
సెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా ||యాతమేసి||
పల్లవి:
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా
పూరి గుడిసెలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు ||యాతమేసి||
చరణం : ౧
పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా
పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా
కుడితి నీళ్లు పోసినా
అది పాలు కుడుపుతాది
కడుపుకోత కోసినా
అది మనిషికే జన్మ ఇత్తాది
బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో ||యాతమేసి||
చరణం : ౨
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా
సెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా ||యాతమేసి||
No comments:
Post a Comment