Tuesday, April 21, 2009

ఆకలి రాజ్యం(1980)

Listening The Song

<p> <a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Akali+Rajyam.html?e">Listen to Akali Rajyam Audio Songs at MusicMazaa.com</a></p>

Down load

Singer(s): Balasubrahmanyam SP
Music Director(s): Viswanathan MS
Lyricist(s): Aatreya

హే హేహే హే హే హే హేయిహే...
ఋ ఋ ఋ ఋ ఋ రూ ఋ రోడూ

సాపాటు ఎటులేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటులేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావూ కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్...

సాపాటు ఎటులేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావూ కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్...

మన తల్లి అన్నపూర్ణ మన అన్నా దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడు
మన కీర్తి మంచు కొండరా...

మన తల్లి అన్నపూర్ణ మన అన్నా దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడు
మన కీర్తి మంచు కొండరా...

డిగ్రీలు తెచ్చుకొని... చిప్పచేత పుచ్చుకొని
డిల్లికి చేరినాము... దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే... బావి పవురులం బ్రదర్

సాపాటు ఎటులేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావూ కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్...

బంగారు పంట మనది మున్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదమురా ఇంట్లో...ఈగల్ని తోలుదమురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప
ఆవేశం ఆపుకొని అమ్మ నాన్నదే తప్ప
ఆవేశం ఆపుకొని అమ్మ నాన్నదే తప్ప
గంగలో మునకేసి, కాషాయం కట్టేయి బ్రదర్...

సాపాటు ఎటులేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావూ కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్...సంతాన మూలికలం, సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా, తమ్ముడు సంపాదనొకటి కరువురా
చదవేయి సీటు లేదు... చదివొస్తే పనిలేదు
అన్నం ఓ రామచంద్ర అంటే పెట్టేదిక్కేలేదు
దేవుడిదే భారమని పెంపు చేయరా బ్రదర్

సాపాటు ఎటులేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావూ కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్...

No comments:

Post a Comment