Saturday, September 5, 2009

గొరింటాకు (1979)


Singer: Balasubrahmanyam SP, Susheela P

Music Director: Mahadevan KV

Lyrics: Veturi Sudhararamamurthy

Actors: Savithri, Sobhan Babu, Sujatha


Plz select the song

Down Load


కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం

కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం

మనసు మాటాకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదన్లోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసు మాటాకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదన్లోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మకొమ్మకో సన్నాయి


కొంటే వయసు కోరికలాగా గోదారి వురకలు చూడు
వురకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటే వయసు కోరికలాగా గోదారి వురకలు చూడు
వురకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి, పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం, అందుకే మౌనం
అందుకే ధ్యానం, అందుకే మౌనం

కొమ్మకొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
ఏమిటీ మౌనం, ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం, మాటలో మౌనం
కొమ్మకొమ్మకో సన్నాయి...

No comments:

Post a Comment