Sunday, October 18, 2009

బాలు

Listen De Song
Dl

కన్నుకొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగా
కంటచూసినా కందిపోతవే తూగే తూనీగా
కన్నుకొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగా
కంటచూసినా కందిపోతవే తూగే తూనీగా
ఐనా సరే అన్నాగా సిద్ధంగానే వున్నాగా
అందం మందారంలా కందేందుకే అందిస్తున్నాగా
దేవుడా అమ్మాయంటే ఇలా కూడ ఉంటుందా
ఎక్కడా మచ్చకూడా ఆడలక్షణం లేకుండా
ఎంతకీ తెగించవే పైగా ఎందుకు ఈ నిందా
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంతా
కన్నుకొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగా
కంటచూసినా కందిపోతవే తూగే తూనీగా
పెదవిచ్చే వరం వొద్దనుకుంటావా... విదిలించే వ్రతం ముద్దనుకుంటావా
బెదిరించే గుణం ప్రేమని అంటావా.... శౄతిమించే తనం క్షేమం అంటావా
వెచ్చగా నిచ్చెలి వస్తే వెళ్ళిపోమంటావా
వెల్లువై ముంచుకువస్తే తాళదే పడవ
నది లోతెంతుందో ఒడ్డున ఉండే చూస్తూ ఉంటావా
దేవుడా అమ్మాయంటే ఇలా కూడ ఉంటుందా
ఎక్కడా మచ్చకూడా ఆడలక్షణం లేకుండా
ఎంతకీ తెగించవే పైగా ఎందుకు ఈ నిందా
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంతా
వాస్తు లోపం ఉందా నా ఒంటి వొంపుల్లో... దౄష్టి దోషం ఉందా నీ కంటి చూపుల్లో
ఈడు తాపం ఇలా వీధెక్కు చిందుల్లో... ఏమి లాభం పిల్లా ఇబ్బందితనంలో
యవ్వనం నివ్వెరపోదా... కోరికే లేదంటే
చెప్పినా నమ్మవుకదా... తీరికే లేదంటే
అరే పాపం అని పాపాయిని పాలించలేవా
దేవుడా అమ్మాయంటే ఇలా కూడ ఉంటుందా
ఎక్కడా మచ్చకూడా ఆడలక్షణం లేకుండా
ఎంతకీ తెగించవే... పైగా ఎందుకు ఈ నిందా
అందుకే... తప్పనిసరై ముందడుగేశా కాస్తంతా

No comments:

Post a Comment