బాలు
Listen De Song
Dl
నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాల్లే ఇట్టాంటివి చాలనే విన్నా
అంటే అన్నానంటూ కోపాలేనా... నువ్వే చెప్పూ నే తప్పన్నానా
పొన్లే నీకేంటంటా... నాకేమైనా ఏదో సాయం నిన్నిమన్నానా
వలపంటే నిప్పులాంటిది... కలకాలం దాచలేనిది
సలహా విని ఒప్పుకోవే ఇకనైనా
సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది
అయినా మరి ముందు నీకె తెలిసేనా
ప్రతి రోజు నడిరాతిర్లో చేస్తావా స్నానాలు
వొళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళూ
వణికించే చలికాలంలో యేమా ఆవిర్లు
వుడికించే ఆలోచనలూ పుడుతున్నవి కాబోలు
ఇంతిదిగా వేడెక్కే వూహలు రేపిందెవరు
నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు
అదిగో ఆ ఉలుకే చెబుతోంది నువ్వు దాచాలనుకొన్నా
దీన్నే loveలో పడిపోడం అంటున్నా
చాల్లే ఇట్టాంటివి చాలనే విన్నా...
ఒంట్లో బాగుంటంలేదా ఈ మధ్యన నీకసలు
నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు
అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు
వెంటాడే కలలొస్తుంటే నిదురుండదు తెల్లార్లు
అయితే మరి నువ్వెప్పుడూ కనలేదా ఏ కలలు
నా కలలో యే నాడు నువ్వు రాలేదిన్నాళ్ళూ
అదిగో ఆ మాటే నీ నోటే చెప్పించాలనుకొన్నా
దీన్నే love లో పడిపోడం అంటున్నా
హ్మ్మ్ అవునా ఏమో నే కాదనలేకున్నా
నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
నాలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో
అంటే అన్నానంటూ కోపాలేనా... నువ్వే చెప్పూ నే తప్పన్నానా
పొన్లే నీకేంటంటా... నాకేమైనా ఏదో సాయం నిన్నిమన్నానా
వలపంటే నిప్పులాంటిది... కలకాలం దాచలేనిది
సలహా విని ఒప్పుకోవే ఇకనైనా
సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది
అయినా మరి ముందు నీకె తెలిసేనా
No comments:
Post a Comment