మాపల్లెలో గోపాలుడు(1985)
తారాగణం:పూర్ణిమ,రాజా
సంగీతం:కెవి.మహదేవన్
నిర్మాత:ఎస్.గోపాలరెడ్డి
దర్శకత్వం:కోడిరామకృష్ణ
సంస్థ:భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
రాణిరాణమ్మ ...అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని... నీ ముంగిట వాలాలని
నీ వేడుక చూడాలని నీ ముంగిట వాలాలని
ఏన్నెన్ని ఆశలతో...ఎగిరెగిరి వచ్చానమ్మ
రాణిరాణమ్మ... అనాటి నవ్వులు ఏవమ్మ
రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని
రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని
ఎంతగా అనుకున్నాను ...ఏమిటి చూస్తున్నాను?
ఎంతగా అనుకున్నాను... ఏమిటి చూస్తున్నాను?
పన్నీటిబతుకులోన... కన్నీటి మంటలేనా
రాణిరాణమ్మ ...అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని... నీ ముంగిట వాలాలని
ఏన్నెన్ని ఆశలతో... ఎగిరెగిరి వచ్చానమ్మ
రాణిరాణమ్మ... రాణికన్నీళ్ళు రానీయమ్మ
రాణిరాణమ్మ ...రాణికన్నీళ్ళు రానీయమ్మ
సహనం స్త్రీకి కవచమని... శాంతం అందుకు సాక్షమని
సహనం స్త్రీకి కవచమని... శాంతం అందుకు సాక్షమని
ఉన్నాను మౌనంగా కన్నులుదాటని కన్నీరుగా
రాణిరాణమ్మ రానీకన్నీళ్ళు రానీయమ్మ
గుండెరగిలిపోతూవుంటే... గూడుమేడ ఒకటేలే
కాళ్ళుబండబారిపోతే... ముళ్ళు పూలు ఒకటేలే
గుండెరగిలిపోతూవుంటే... గూడుమేడ ఒకటేలే
కాళ్ళుబండబారిపోతే... ముళ్ళు పూలు ఒకటేలే
ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలితీరం
ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలితీరం
ఎదురీత ఆగదులే... విధిరాత తప్పదులే
రాణిరాణమ్మ... అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని ...నీ ముంగిట వాలాలని
ఏన్నెన్ని ఆశలతో... ఎగిరెగిరి... వచ్చానమ్మ
రాణిరాణమ్మ.... అనాటి నవ్వులు ఏవమ్మ
No comments:
Post a Comment