Monday, May 24, 2010

Movie Name: Gulabi (1995)
Singer: Sasi Preetam
Music Director: Sasi Preetam
Lyrics: Siri Vennela Sitarama Sastry
Year: 1995
Actors: Chakravarthy J D, Maheshwari


యే రోజైతె చూసానో నిన్ను ఆరోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా యే దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తునానూ
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో
నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను యెటువైపున్నా
నీ కష్టంలో నేను ఉన్నాను
కరిగే నీ కన్నీరవుతా నేను
చెంప్పల్లో కారి నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతంలొ ఓదార్పవుతాను

కాలం యేదో గాయం చేసింది
నిన్నే మాయం చేసానంటొంది
లొకం నమ్మి అయ్యొ అంటొంది
సొకం కమ్మి జోకొడతానంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా
నీతో గడిపిన ఆ నిమిషాలన్ని
నాలో మోగే గుండెల సవ్వడులే
అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగ
నువ్వు లేకుంటే నేనంటూ ఉండను గా

నీ కష్టంలో నేను ఉన్నాను
కరిగే నీ కన్నీరవుతా నేను
చెంప్పల్లో కారి నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతంలొ ఓదార్పవుతాను
యే రోజైతె చూసానో నిన్ను ఆరోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా యే దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తునానూ

No comments:

Post a Comment