Tuesday, October 26, 2010

చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల




Plz select the song
DL


ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు
ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు



చరణం  1 :
అడుగు అడుగున అపజయములతో
అలసి సొలసిన నా హృదయానికి
సుధవై... సుధవై జీవన సుధవై
ఉపశాంతినివ్వగా ఓర్వనివారలు
ఎవరో జ్వాలను రగిలించారు

వేరెవరో దానికి బలియైనారు

చరణం  2:
అనురాగానికి ప్రతిరూపాలై
ఆది దంపతులవలె మీరుంటే
అనురాగానికి ప్రతిరూపాలై
ఆది దంపతులవలె మీరుంటే
ఆనందంతో మురిసానే
ఆత్మీయులుగా తలచానే
అందుకు ఫలితం... అపనిందేనా

ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు

చరణం  3:
మనిషికి ...మనిషికి మమత కూడదా...
మనసు తెలుసుకొను... మనసే లేదా
ఇది తీరని శాపం
ఇది మారని లోకం
మానవుడే ...దానవుడై 
మసలే చీకటి నరకం

ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు
ఎవరో జ్వాలను రగిలించారు



No comments:

Post a Comment