Thursday, October 28, 2010

చిత్రం : కులగోత్రాలు (1962)
రచన : కొసరాజు రాఘవయ్య చౌదరి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం:మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు

Plz select the song


Dl



పల్లవి :


అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే 
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే 


పల్లవి : ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది
ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది
పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయింది  
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే 


చరణం  1 :
ఆ మహా మహా నలమహారాజుకే  ...తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ
మరి నువు చెప్పలేదు భాయీ
అది నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగ  చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ... బాబూ నిబ్బరించవోయీ
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే 


చరణం  2 :
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా... గోవిందా... 
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా... గోవిందా... 
చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే 
ఎం.ఎల్.ఏ దక్కేది...మనకు అంతటి లక్కేదీ॥
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే 


చరణం  3 :
గెలుపూ ఓటమి దైవాధీనం ...చెయ్యి తిరగవచ్చు
మళ్ళీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడెవడిచ్చు ...ఇల్లు కుదవ చేర్చవచ్చు
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో 
మన కరువు తీరవచ్చు
పోతే... అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు ॥


అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే 

No comments:

Post a Comment