Saturday, October 30, 2010

Cast:Ranganath,Chandramohan,Prabha,Jayasudha
Music:Rajan-Nagendra
Director:P.Sambasiva Rao
Producer:Navata Krishnam raju
Singers:SP Balu,S Janaki
Lyrics:Veturi Sundara Rama Murthy
Movie : Intinti Ramayanam




DL


వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ...తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహ లాడాల... చెలరేగాల ...చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో

వీణ వేనువైన సరిగమ విన్నావా
ఓ..తీగ రాగమైన మధురిమ కన్నావా

ఊపిరి తగిలిన వేళ ...నీ ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
చూపులు తగిలిన వేళ ... ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువునా... అణువణువునా ...జరిగే రాసలీల
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ..తీగ రాగమైన మధురిమ కన్నావా

యదలో ...అందం ఎదుట... ఎదుటే వలచిన వనితా
నీ రాకతో ...నా తోటలో... వెలసే వన దేవతా
కదిలే అందం... కవితా అది కౌగిలికొస్తే... యువతా
నా పాటలో నీ పల్లవే... నవతా నవ్య మమతా
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ..తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహ లాడాల ...చెలరేగాల... చెలి ఊగాల... ఉయ్యాలలీవేళలో
వీణ వేనువైన సరిగమ విన్నావా
ఓ..తీగ రాగమైన మధురిమ కన్నావా

లా లా లా లా లా లా

No comments:

Post a Comment