Monday, March 7, 2011

చిత్రం : ప్రేమలేఖ (1996)
రచన : భువనచంద్ర
సంగీతం : దేవా
గానం : కృష్ణరాజ్, భువనచంద్ర




Get Your Own Hindi Songs Player at Music Plugin





DL


పల్లవి :


చిన్నాదానా ఓసి చిన్నాదానా
ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా... 

చిన్నాదానా ఓసి చిన్నాదానా
ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా...
కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే కన్నే ఒళ్ళు
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనీ పళ్ళు...

చిన్నాదానా ఓసి చిన్నాదానా
ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా... 



చరణం :
నువ్వు నేను కలిసిన వేళ
ఆశగ ఏదో మాటాడాలా
ఏం కావాలో చెవిలో చెప్పేయ్ చిన్నమ్మా
ఓ సింగపూరు సెంటు చీర
స్టీలు ప్లాంటు గాజువాక
రెండో మూడో ఇళ్ళిస్తానే బుల్లెమ్మా...
ఊరి ముందర మేళం పెట్టి
పూల మేడలో తాళిని గట్టి
నా పక్క నువ్వు ఉండక్కర్ల జాలీగా...
నీ మెరుపుల చూపులు చాలు
నీ నవ్వు మాటలు చాలు
నేనిమ్మనే నూరు ముద్దులు ఇస్తావా
నీ తలంపే మత్తెక్కిస్తుందే...
బడబడ బడమని
నా మనస్సును తొందర చేస్తుందే...
కళ్ళు రెండు...వెతికేస్తున్నాయో
గడగడ... గడమని
తట్టి నన్ను లాగేస్తున్నాయే... ఓ... ఓ... ఓ...
చిన్నాదానా ఓసి చిన్నాదానా
ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా... 



చరణం : 
చూసి చూడకుండా వెళ్లే పడుచు పిల్లల్లారా
ఈ ప్రేమికుడు వంక కాస్త
కళ్ళు తెరచి చూడండోయ్
రెండు కాళ్ళమీద లేచి నిలబడి
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారంటే
వాతం వచ్చి మైకంలో పడిపోతారో... ఓ...
సిగ్గు లజ్జా మానం అన్నీ మరిపించేదే నాగరికత
ఎనిమిది మూర్ల చీరాలెందుకు చిన్నమ్మా
ఆ...! వంకాయ పులుసు వండాలంటే
పుస్తకాలు తిరగేసేయటం
ఫ్యాషన్ అయిపోయిందే ...ఇప్పుడు బుల్లెమ్మా
ఫేస్ కట్‌కి ఫెయిర్ అండ్ లవ్‌లీ
జాకట్‌కి లోకట్ డైలీ
లో టిప్‌కి నో రిప్లయి ఏలమ్మా
లాకెట్‌లో లారా కాంబ్లీ
నోట్‌బుక్‌లో సచిన్ జాక్సన్
హెయిర్‌కట్‌కి బ్యూటీ పార్లర్ ఏలమ్మా

నీ తలంపే మత్తెక్కిస్తుందే...
బడబడ బడమని
నా మనస్సును తొందర చేస్తుందే...
కళ్ళు రెండు...వెతికేస్తున్నాయో
గడగడ... గడమని
తట్టి నన్ను లాగేస్తున్నాయే... ఓ... ఓ... ఓ...
చిన్నాదానా ఓసి చిన్నాదానా
ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా... 

చిన్నాదానా ఓసి చిన్నాదానా
ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా...

కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే కన్నే ఒళ్ళు
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనీ పళ్ళు...

No comments:

Post a Comment