Tuesday, July 5, 2011


Aatma Bandhuvu 1985 

Starring:Sivaji Ganeshan, Radha
Music:Ilayaraja
Director:
Bharathiraja



పల్లవి :
మనిషికో స్నేహం మనసుకో దాహం (2)
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం
చరణం : 1
ఒక చిలక ఒద్దికైంది మరు చిలక మచ్చికైంది
వయసేమో మరిచింది మనసొకటై కలిసింది
కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగు ఆగేనా
ప్రేమలేని నాడీ నేల పూవులిన్ని పూచేనా
మనిషిలేని నాడు దేవుడైనా లేడు
మంచిని కాచే వాడు దేవుడికి తోడు

చరణం : 2
వయసు వయసు కలుసుకుంటే
పూరి గుడిసె రాచనగరు...
ఇచ్చుకోను పుచ్చుకోను
ముద్దులుంటే పొద్దుచాలదు
ప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదు
గువ్వ గూడు కట్టే చోట కుంపటెత్తి పోరాదు
ఓర్వలేని త్యాగం ఒప్పుకోదు నేస్తం
జాతి మత భేదాలన్నీ స్వార్థపరుల మోసం

No comments:

Post a Comment