Tuesday, July 5, 2011

డా.చక్రవర్తి (1964)


Dl 
ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు
ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు

అడుగు అడుగున అపజయములతో
అలసి సొలసిన నా హ్రుదయానికి
సుధవై ...సుధవై జీవన సుధవై
ఉపశానితి నివ్వగా ఓర్వని వారలు
ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు
అనురాగానికి ప్రతిరూపాలై
ఆదిదంపతులవలె మీరుంటే
ఆనందంతో మురిసానే
ఆత్మీయులుగా తలిచా...నే
అందుకు ఫలితం అపనిందేనా ..//ఎవరో //

మనిషికి మనిషికి మమత కూడదా
మనసు తెలుసుకొను మనసే లేదా
ఇది తీరని శాపం
ఇది మారని లోకం
మానవుడే దానవుడై మసలే చీకటి లోకం
ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు

No comments:

Post a Comment