Tuesday, March 26, 2013

మొగుడు

సంగీతం: బాబూ శంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

Plz Select the song

DL ...Plz Select the Song

చూస్తున్నా...చూస్తు ఉన్నా...చూస్తూనే ...ఉన్నా
ఇప్పుడే ... ఇక్కడే ... వింతగా ... కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని ... ఇన్నాళ్ళూ నాకే తెలియని
నన్నూ... నేనే... నీలో

చూస్తున్నా... చూస్తు ఉన్నా... చూస్తూనే ఉన్నా ...

పచ్చని... మాగాణి చేలూ... పట్టు చీరగా కట్టీ
బంగారు ... ఉదయాల సిరులూ... నొసత బాసికంగా చుట్టీ
ముంగిట ... సంక్రాతి ముగ్గులు ...చెక్కిట సిగ్గులుగా దిద్దీ
పున్నమి... పదహారు కళలూ సిగలో పువ్వులుగా పెట్టి

దేవేరిగా... పాదం పెడతానంటూ  
నాకూ ... శ్రీవారిగా ... పట్టం కడతానంటూ

నవనిధులూ వధువై వస్తుంటే
సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నేనైనట్టూ...

చూస్తున్నా... చూస్తు ఉన్నా... చూస్తూనే ఉన్నా !!

నువ్వూ ... సేవిస్తుంటే నేను సార్వభౌముడైపోతానూ
నువ్వూ ... తోడై ఉంటే సాగరాలు దాటేస్తానూ
నీ... సౌందర్యంతో ఇంద్రపదవినెదిరిస్తానూ
నీ ... సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఏదంటానూ

ఏళ్ళే వచ్చీ... వయసును మళ్ళిస్తుంటే
నేనే ... నీ వళ్ళో పాపగ చిగురిస్తుంటే

చూస్తున్నా...ఆ ఆ ఆ


చూస్తున్నా...చూస్తు ఉన్నా...చూస్తూనే ...ఉన్నా
ఇప్పుడే ... ఇక్కడే ... వింతగా ... కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని ... ఇన్నాళ్ళూ నాకే తెలియని
నన్నూ... నేనే... నీలో


చూస్తున్నా...చూస్తు ఉన్నా...చూస్తూనే ...ఉన్నా

No comments:

Post a Comment