Thursday, October 17, 2013

చిత్రం : మనసంతా నువ్వే (2001)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : కె.ఎస్.చిత్ర





<p> <a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Manasanta+Nuvve.html?e">Listen to Manasanta Nuvve Audio Songs at MusicMazaa.com</a></p>






పల్లవి : కిటకిట తలుపులు
తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు
అలసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసీ ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమా కిటకిట॥



చరణం : 1
నిన్నిలా చేరేదాక ఎన్నడూ నిదరేరాక
కమ్మని కలలో అయినా నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక
రెప్పపాటైనా లేక చూడాలనుందే
నాకోసమా అన్వేషణ నీడల్లే వెంట ఉండగా
కాసేపిలా కవ్వించనా
నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమా ॥



చరణం : 2
కంటతడి నాడూ నేడు చంప తడి నిండే చూడు
చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే చేరి తీపి చిరునవ్వే చేరి
అమృతం అయిపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం
నడిపింది నన్ను జంటగా
ఈనాడిలా నా పరిచయం
అడిగింది కాస్త కొంటెగా
ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమా॥






No comments:

Post a Comment