Thursday, October 17, 2013

చిత్రం : ఆరెంజ్ (2010)
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : కార్తీక్, బృందం


చిలిపిగ చూస్తావలా
పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా
వేస్తావే వల నీతో వేగేదెలా
ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు
ఎంతో బాగున్నదీ కల
కొన్నాళ్లే అందంగా ఊరిస్తోంది
ఆపై చె రుపుతోందిలా
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా



నిన్నే ఇలా చేరగా మాటే మార్చి
మాయే చెయ్యాలా
నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా
ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా ఊరించేస్తూ
అల్లేస్తోందే నీ సంకెల
కొంచెం మధురము కొంచెం విరహము
ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము కొంచెం శాంతము
గొంతులో జారు గరళం
కొంచెం పరువము కొంచెం
ప్రణయము గుండెనె కోయు గాయం
కొంచెం మౌనము కొంచెం గానము
ఎందుకీ ఇంద్రజాలం



ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమ నుంచి
వేరై పోతున్నా
మళ్లీ మరో గుండెతో
స్నేహం కోరి వెడుతున్నా
ప్రేమనే దాహం తీర్చే
సాయం కోసం వేచానిలా
ఒక్కో క్షణం ఆ సంతోషం
నాతో పాటు సాగే దెలా ఎలా

No comments:

Post a Comment