Wednesday, September 30, 2009

సుస్వాగతం





ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందో...తాపాన బలిపెడుతుందో.
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో...ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం

ఎండమావిలో ఎంతవెతికినా నీటిచెమ్మ దొరికేనా?
గుండెబావిలో ఉన్నఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదరఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ..ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
సూర్యబింబమే అస్తమించనిదే మేలుకోని కలకోసం
కళ్ళు మూసుకొని కలవరించెనే చంటిపాప పాపం ...
ఆయువిచ్చి పెంచినబంధం మౌనంలో మసిఅయినా
రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా..
పొందేది ఏదేమైనా... పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం....

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో..
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

No comments:

Post a Comment