Wednesday, October 28, 2009

ఘర్షణ

Listen The Song


Dl


ఒక బృందావనం...సోయగం...
ఎద కోలాహలం...క్షణ క్షణం...

ఒకే స్వరం...సాగెను తీయగా...
ఒకే సుఖం... విరిసేను హాయిగా...
ఒక బృందావనం...సోయగం...

నే సందెవేళ జాబిలీ...నా గీతమాల ఆమనీ...
నా పలుకు తేనె కవితలే...నా కులుకు చిలక పలుకులే...

నే కన్న కలల మేడ నందనం...నా లోని వయసు ముగ్ధ మోహనం...
ఒకే స్వరం...సాగెను తీయగా...
ఒకే సుఖం... విరిసేను హాయిగా...
ఒక బృందావనం...సోయగం...

నే మనసుపడిన వెంటనే... ఓ ఇంద్రధనుస్సు పొందునే...
ఈ వెండి మేఘమాలనే...నా పట్టుపరుపు చేయనే...
నే సాగు బాట... జాజిపూవులే...నాకింక సాటి పోటి లేదులే
...
ఒకే స్వరం...సాగెను తీయగా...
ఒకే సుఖం... విరిసేను హాయిగా...
ఒక బృందావనం...సోయగం...
ఒకే స్వరం...సాగెను తీయగా...
ఒకే సుఖం... విరిసేను హాయిగా...

ఒక బృందావనం...సోయగం...

No comments:

Post a Comment