నువ్వు నాకు నచ్చావు
LS
Dl
ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ చెంత చేరి పంచుకోవ ఆశనీ శ్వాసని
మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేల
వెన్నెలేదో వేకువేదొ నీకు తెలుసా మరి
ఓ నిదురపోయె మదిని గిల్లి ఎందుకా అల్లరి
చందమామ మనకందదని ముందుగానె అది తెలుసుకొని
చెయి చాచి పిలవొద్దు అని చంటి పాపలకు చెపుతామా
లేని పోని కలలెందుకని మేలుకొంటె అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని కంటి పాపలకు చెపుతామా
కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి మన నడిగి చేరుతుంద
ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ చెంత చేరి పంచుకోవ ఆశనీ శ్వాసని
అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపొని దూరం ఉంద
అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో
కెరటం ఎగిరిపడుతు ఉంటె ఆకసం తెగిపడుతుందా
మనసుంటె మార్గం ఉంది కద అనుకొంటె అందనిదుంటుంద
అనుకున్నవన్ని మనకందినట్టె అనుకొంటె తీరిపోదా
ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ చెంత చేరి పంచుకోవ ఆశనీ శ్వాసని
మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేల
No comments:
Post a Comment