జానకి రాముడు
Listen The Song dl
నా గొంతు శృతిలోనా
నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మజన్మలా
నా గొంతు శృతిలోనా
నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మజన్మలా
నా గొంతు శృతిలోనా
నా గుండె లయలోనా
ఒకమాట పది మాటలై... అది పాట కావాలని
ఒక జన్మ పది జన్మలై... అనుబంధమవ్వాలని
అన్నిటా ఒక మమతే... పండాలని
అది దండలో దారమై... ఉండాలని
అన్నిటా ఒక మమతే... పండాలని
అది దండలో దారమై... ఉండాలని
కడలిలో అలలుగా...కడలేని కలలుగా
నిలిచిపోవాలని...
పాడవే... పాడవే కొయిల
పాడుతు పరవశించు జన్మ జన్మలా
నా గొంతు శృతిలోనా
నా గుండె లయలోనా
ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలని
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని
కోరికే ఒక జన్మ కావాలని
అది తీరకే మరు జన్మ రావాలని
కోరికే ఒక జన్మ కావాలని
అది తీరకే మరు జన్మ రావాలని
వలపులే రెక్కలుగా... వెలుగులే దిక్కులుగా
ఎగరిపోవాలని ...
పాడవే... పాడవే కొయిల
పాడుతు పరవశించు జన్మ జన్మలా
నా గొంతు శృతిలోనా
నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మజన్మలా
No comments:
Post a Comment